ఈ కోర్సులు దూరం కావు!
* సార్వత్రిక విద్యలో వైవిధ్యం
* ప్రవేశాలకు తరుణమిదే
ఆధునిక
అవసరాలకు అనుగుణంగా విస్తృత స్థాయిలో కోర్సులను అందిస్తూ సార్వత్రిక
విశ్వవిద్యాలయాలు విద్యార్థులను ఆకర్షిస్తున్నాయి. సాంప్రదాయిక కోర్సులతో
పాటు వైవిధ్యమైన కోర్సుల దిశగా వడివడిగా అడుగులేస్తుండటమే వీటి
ప్రాచుర్యానికి కారణం. అందుబాటులో స్టడీ సెంటర్లు, నచ్చిన కోర్సు ఎంచుకునే
స్వేచ్ఛ, నాణ్యమైన స్టడీ మెటీరియల్ ...ఇవన్నీ దూరవిద్యను దగ్గర చేశాయి.
తాజాగాఇందిరాగాంధీ, బీఆర్ అంబేడ్కర్ వర్సిటీలు సర్టిఫికెట్, డిప్లొమా,
డిగ్రీ, పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు ప్రకటనలు వెలువరించాయి. వీటితోపాటు
తెలుగు రాష్ట్రాల్లోని యూనివర్సిటీలు ఎన్నో దూరవిద్య కోర్సులను
అందిస్తున్నాయి.
ఒక్కో విశ్వవిద్యాలయం ఒక్కో తరహా దూరవిద్యకు ప్రసిద్ధి
చెందింది. కొన్నిచోట్ల ప్రత్యేకమైన కోర్సులు అందుబాటులో ఉన్నాయి. అర్హత
పెంచుకోవడానికి ఉపయోగపడే కోర్సులు కొన్నైతే, ఉద్యోగ అవకాశాలు
మెరుగుపరచుకోవడానికి పనికొచ్చేవి మరికొన్ని. ఇప్పటికే ఆయా విభాగాల్లో సేవలు
అందిస్తోన్నవారికి నైపుణ్యాన్నిపెంచే చదువులు సైతం పలు సంస్థలు
అందిస్తున్నాయి. అభ్యర్థులు తమ అవసరాలకు అనుగుణంగా కోర్సును ఎంచుకోవచ్చు.
ప్రతి విద్యార్థికీ ఉపయోగపడే కోర్సు ఏదో ఒక విశ్వవిద్యాలయంలో తప్పక
దొరుకుతుంది. బీఏ, బీకాం, బీఎస్సీ, ఎంఏ, ఎంకాం, ఎమ్మెస్సీ, ఎంబీఏ...తదితర
కోర్సులు దాదాపు అన్ని యూనివర్సిటీలూ అందిస్తున్నాయి. సర్టిఫికెట్, పీజీ
డిప్లొమా కోర్సుల్లో మాత్రం ఆయా సంస్థలవారీ వైవిధ్యం కనిపిస్తోంది.
ఇగ్నో...
దేశంలో అత్యధిక సంఖ్యలో దూరవిద్య కోర్సులు అందిస్తోన్న,
విద్యార్థులు చేరుతోన్న విశ్వవిద్యాలయం ఇదే. దాదాపు అన్ని సబ్జెక్టులు/
విభాగాల్లోనూ ఇందిరాగాంధీ జాతీయ సార్వత్రిక విశ్వవిద్యాలయం (ఇగ్నో) అన్ని
రకాల కోర్సులు అందిస్తోంది. ఏటా రెండు విడతల్లో ప్రవేశాలు లభిస్తాయి.
కొన్ని కోర్సులను జనవరి, మరికొన్నింటిని జులై సెషన్లలో అందిస్తోంది.
ప్రస్తుతం జులై సెషన్ ప్రవేశాలకు ప్రకటన వెలువడింది. ఎంచుకున్న కోర్సు
ప్రకారం ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్‌లో ప్రవేశాలు ఉంటాయి. సర్టిఫికెట్
కోర్సులకు జులై 15, మిగిలిన అన్ని కోర్సులకు జులై 31లోపు దరఖాస్తు
చేసుకోవాలి.
జులై సెషన్‌లో లభ్యమయ్యేవి
ఎమ్మెస్సీ: ఫుడ్ అండ్ న్యూట్రిషన్, కౌన్సెలింగ్ అండ్ ఫ్యామిలీ థెరపీ
ఎంఏ: అడల్ట్ ఎడ్యుకేషన్, ఉమెన్ అండ్ జండర్ స్టడీస్
పీజీ డిప్లొమా:
కౌన్సెలింగ్ అండ్ ఫ్యామిలీ థెరపీ, అడల్ట్ ఎడ్యుకేషన్, ఫుడ్ సేఫ్టీ
అండ్ క్వాలిటీ మేనేజ్‌మెంట్, ప్లాంటేషన్ మేనేజ్‌మెంట్, బుక్
పబ్లిషింగ్, ఉమెన్ అండ్ జండర్ స్టడీస్, మెంటల్ హెల్త్
డిప్లొమా: వాల్యూ యాడెడ్
ప్రొడక్ట్స్ ఫ్రం ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్, డెయిరీ టెక్నాలజీ, మీట్
టెక్నాలజీ, ప్రొడక్షన్ ఆఫ్ వాల్యూ యాడెడ్ ప్రొడక్ట్స్ ఫ్రం సిరీల్స్,
పల్సెస్ అండ్ ఆయిల్ సీడ్స్, ఫిష్ ప్రొడక్ట్స్ టెక్నాలజీ,
వాటర్‌షెడ్ మేనేజ్‌మెంట్, రిటైలింగ్
సర్టిఫికెట్: టీచింగ్
ఆఫ్ ప్రైమరీ స్కూల్ మ్యాథమేటిక్స్, జపనీస్ లాంగ్వేజ్; బీబీఏ
(రిటైల్). ఈ జులై సెషన్ నుంచి కొత్తగా పీజీ సర్టిఫికెట్ ఇన్ క్లైమేట్
చేంజ్ కోర్సు అందిస్తున్నారు. ఏదైనా డిగ్రీ పూర్తిచేసుకున్నవారు దరఖాస్తు
చేసుకోవచ్చు.
రెగ్యులర్‌గా అందించే బీఏ, బీకాం, ఎంఏ, ఎమ్మెస్సీ,
సర్టిఫికెట్, డిప్లొమా కోర్సులెన్నో ఈ సెషన్‌లో అందుబాటులో ఉన్నాయి. బీ
కీపింగ్, సెరి కల్చర్, పౌల్ట్రీ ఫార్మింగ్..తదితర స్వయం ఉపాధి
కోర్సుల్లోనూ చేరవచ్చు.
డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ విశ్వవిద్యాలయం
తెలుగు
రాష్ట్రాల్లో ఎక్కువమంది దూరవిద్య విధానంలో డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్
సార్వత్రిక విశ్వవిద్యాలయం అందించే కోర్సుల్లో చేరుతున్నారు. తక్కువ ఫీజుతో
కోర్సు పూర్తి కావడం, స్టడీ సెంటర్లు అందుబాటులో ఉండడం, మెటీరియల్
నాణ్యత...తదితర కారణాలతో విద్యార్థులకు ఈ విశ్వవిద్యాలయం దగ్గరైంది. తెలుగు
మీడియంలో పీజీ కోర్సులు అందించడం దీని ప్రత్యేకత.
ఎంఏ: ఎకనామిక్స్,
హిస్టరీ, పొలిటికల్ సైన్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, సోషియాలజీ,
జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్, ఇంగ్లిష్, హిందీ, తెలుగు, ఉర్దూ
ఎమ్మెస్సీ: మ్యాథ్స్,
అప్లైడ్ మ్యాథ్స్, సైకాలజీ, బోటనీ, జువాలజీ, కెమిస్ట్రీ, ఫిజిక్స్,
ఎన్విరాన్‌మెంటల్ సైన్స్, ఎంకాం, ఎంబీఏ, ఎంఎల్‌ఐఎస్సీ, బీఎల్‌ఐఎస్సీ
పీజీ డిప్లొమా:
మార్కెటింగ్ మేనేజ్‌మెంట్, బిజినెస్ మేనేజ్‌మెంట్, ఎన్విరాన్‌మెంటల్
స్టడీస్, రైటింగ్ ఫర్ మాస్ మీడియా ఇన్ తెలుగు, హ్యూమన్ రైట్స్,
కల్చర్ అండ్ హెరిటేజ్ టూరిజం, ఉమెన్స్ స్టడీస్
సర్టిఫికెట్ ప్రోగ్రాం: ఫుడ్
అండ్ న్యూట్రిషన్, లిటరసీ అండ్ కమ్యూనిటీ డెవలప్‌మెంట్, ఎన్జీవో
మేనేజ్‌మెంట్, ఎర్లీ చైల్డ్‌హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్.
పీజీ డిప్లొమాల వ్యవధి ఏడాది. సర్టిఫికెట్ కోర్సులకు ఆరు నెలలు.
యూజీలో ఎంచుకోవడానికి ఉన్న ఆప్షన్లు
కళలు (ఆర్ట్స్): తెలుగు సాహిత్యం, ఆంగ్ల సాహిత్యం, హిందీ సాహిత్యం, ఉర్దూ సాహిత్యం
సోషల్ సైన్సెస్ (సామాజిక శాస్త్రాలు): అర్థశాస్త్రం, చరిత్ర, రాజనీతిశాస్త్రం, మనోవిజ్ఞానశాస్త్రం, ప్రభుత్వ పాలనశాస్త్రం, సమాజశాస్త్రం, జర్నలిజం
విజ్ఞానశాస్త్రాలు (సైన్స్): వృక్షశాస్త్రం, జంతుశాస్త్రం, రసాయనశాస్త్రం, భౌతికశాస్త్రం, గణితశాస్త్రం, గణాంకశాస్త్రం, భూగర్భశాస్త్రం
వాణిజ్యశాస్త్రం (కామర్స్).
యూజీ కోర్సులకు ట్యూషన్ ఫీజు ఏడాదికి రూ.2వేలు చొప్పున
చెల్లించాలి. సైన్స్ కోర్సుల్లో చేరినవారు ల్యాబ్ ఫీజు ఒక్కో సబ్జెక్టుకు
రూ.1200 చొప్పున కట్టాలి. యూజీ కోర్సులను ఛాయిస్ బేస్డ్ క్రెడిట్
విధానంలో నిర్వహిస్తున్నారు.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: ఆగస్టు 16. రూ.200 ఆలస్య రుసుముతో: ఆగస్టు 31.
నైపుణ్యాభివృద్ధికీ తోడ్పాటు - డా. ఎస్. ఫయాజ్ అహ్మద్, రీజనల్ డైరెక్టర్, ఇగ్నో ప్రాంతీయ కేంద్రం, హైదరాబాద్
దూరవిద్య అత్యాధునిక ధోరణులను అందిపుచ్చుకుంటోంది. ఇగ్నో
‘సెంటర్ ఫర్ ఆన్‌లైన్ ఎడ్యుకేషన్’ను ఆరంభించి ప్రయోగాత్మకంగా ఎం.ఎ.
హిందీని ప్రవేశపెట్టింది. డిస్టెన్స్ డిగ్రీలకు సంప్రదాయ డిగ్రీలతో
సమానంగా గుర్తింపు ఉంది. వీటి ఆధారంగా వివిధ రంగాల్లో ఉద్యోగాల్లో
కొనసాగుతున్నవారు ఎందరో ఉన్నారు. దూరవిద్యలో చదువుకుని, ఆపై ఉన్నతవిద్యా
కోర్సుల్లో చేరవచ్చు. వివిధ కోర్సుల ద్వారా విద్యార్థుల నైపుణ్యాభివృద్ధికి
కూడా దూరవిద్య దోహదపడుతోంది.
ఆంధ్రా యూనివర్సిటీ...
సర్టిఫికెట్ కోర్సులు: ఆఫీస్
ఆటోమేషన్ అండ్ అకౌంటింగ్, ఆఫీస్ ఆటోమేషన్ అండ్ మల్టీమీడియా
టెక్నాలజీస్, ఆఫీస్ ఆటోమేషన్ అండ్ ఇంటర్నెట్ టెక్నాలజీస్. ఇంటర్
అర్హతతో వీటిలో చేరవచ్చు. ఆంగ్ల మాధ్యమంలో అందిస్తున్నారు. వ్యవధి ఏడాది.
ఫీజు రూ.2500.
డిప్లొమా కోర్సులు: మ్యూజిక్. రెండేళ్ల వ్యవధి. స్పోకన్ హిందీ అండ్ ట్రాన్స్‌లేషన్ 6 నెలలు. ఇంటర్ విద్యార్హతతో చేరవచ్చు.
పీజీ డిప్లొమా:
కోపరేషన్ అండ్ రూరల్ స్టడీస్, ఫంక్షనల్ ఇంగ్లిష్, ట్రావెల్ అండ్
టూరిజం మేనేజ్‌మెంట్, వాలంటరీ ఆర్గనైజేషన్స్ మేనేజ్‌మెంట్, కంప్యూటర్
ప్రోగ్రామింగ్ అండ్ అప్లికేషన్స్, ట్రాన్స్‌లేషన్ (ఇంగ్లిష్ నుంచి
తెలుగులోకి), ఎన్విరాన్‌మెంటల్ స్టడీస్, మేనేజ్‌మెంట్, డిజాస్టర్
మేనేజ్‌మెంట్, ఫంక్షనల్ హిందీ అండ్ ట్రాన్స్‌లేషన్.
ఇవే కాకుండా బీఏ, బీకాం, బీఎస్సీ, ఎంఏ, ఎంకాం,
ఎమ్మెస్సీ, ఎంసీఏ, ఎంబీఏ, ఎంహెచ్‌ఆర్‌ఎం కోర్సులు ఉన్నాయి. ఎంబీఏ
హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ మూడేళ్ల వ్యవధితో ఇక్కడ అందిస్తున్నారు.
ఉస్మానియా
బీఏ: ఇక్కడ 45 రకాల
కాంబినేషన్లలో బీఏ కోర్సులు అందిస్తున్నారు. అందువల్ల యూజీలో వైవిధ్యమైన
సబ్జెక్టు కాంబినేషన్లు కోరుకునేవారు ఓయూలో చేరడానికి ప్రాధాన్యం
ఇవ్వవచ్చు.
బీఎస్‌సీ: బీఎస్సీ ఏవియేషన్
బీబీఏ
పీజీ డిప్లొమా: మ్యాథమెటిక్స్, బయోఇన్ఫర్మాటిక్స్, బిజినెస్ మేనేజ్‌మెంట్
ఎంఏ: పబ్లిక్ పర్సనల్ మేనేజ్‌మెంట్ మొదలైనవి.
ఆచార్య నాగార్జున
బీఏ: ఎకనామిక్స్, బ్యాంకింగ్, కంప్యూటర్ అప్లికేషన్స్
ఎంబీఏ: టూరిజం అండ్ ట్రావెల్ మేనేజ్‌మెంట్
ఎమ్మెస్సీ: ఫుడ్స్ అండ్ న్యూట్రిషనల్ సైన్స్
డిప్లొమా: డిప్లొమా ఇన్ ఫుడ్ ప్రొడక్షన్ (పదో తరగతితో)
పీజీ డిప్లొమా: హాస్పిటల్ అండ్ హెల్త్‌కేర్
మేనేజ్‌మెంట్, ఇన్సూరెన్స్ మేనేజ్‌మెంట్, హోటల్ మేనేజ్‌మెంట్, ట్రావెల్
అండ్ టూరిజం మేనేజ్‌మెంట్, బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ మేనేజ్‌మెంట్,
ఇంటర్నేషనల్ బిజినెస్, బయో ఇన్ఫర్మాటిక్స్, బయోటెక్నాలజీ, ఇన్ఫర్మేషన్
టెక్నాలజీ మొదలైనవి
హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం
పీజీ డిప్లొమా కోర్సులకు ఈ విశ్వవిద్యాలయం ప్రసిద్ధి
చెందింది. ఈ కోర్సులను దూరవిద్య విధానంలో నిర్వహిస్తున్నప్పటికీ వర్చువల్
లర్నింగ్ సౌలభ్యం ఉంది. వీటిలో దాదాపు కోర్సులకు డిగ్రీ అర్హతతో
చేరవచ్చు. కొన్నింటికి సంబంధిత విభాగాల్లో పని అనుభవం అవసరం. ఈ కోర్సుల
వ్యవధి ఏడాది.
పీజీ డిప్లొమా: ప్రాజెక్ట్
మేనేజ్‌మెంట్, బిజినెస్ మేనేజ్‌మెంట్, ఎనర్జీ మేనేజ్‌మెంట్, లైబ్రరీ
ఆటోమేషన్ అండ్ నెట్‌వర్కింగ్, సైబర్ లాస్ అండ్ ఇంటలెక్చువల్
ప్రాపర్టీ రైట్స్, కమ్యూనికేటివ్ ఇంగ్లిష్, క్రిమినల్ జస్టిస్ అండ్
ఫోరెన్సిక్ సైన్స్, గవర్నెన్స్, హ్యూమన్ రైట్స్, కెమికల్ అనాలిసిస్
అండ్ క్వాలిటీ మేనేజ్‌మెంట్, టెక్నాలజీ మేనేజ్‌మెంట్ ఇన్ అగ్రికల్చర్,
ఎడ్యుకేషన్ టెక్నాలజీ మేనేజ్‌మెంట్, టెలికాం టెక్నాలజీ అండ్
మేనేజ్‌మెంట్, హాస్పిటల్ మేనేజ్‌మెంట్, హెల్త్‌కేర్ మేనేజ్‌మెంట్,
డిప్లొమా ఇన్ పంచాయతీ రాజ్ గవర్నెన్స్ అండ్ రూరల్ డెవలప్‌మెంట్
కోర్సులు.
ఎస్‌వీయూ
పీజీ డిప్లొమా ఇన్ ఇంస్టియల్ రిలేషన్స్ అండ్
పర్సనల్ మేనేజ్‌మెంట్, పీజీ డిప్లొమా ఇన్ గైడెన్స్ అండ్ కౌన్సెలింగ్ ఈ
విశ్వవిద్యాలయం అందించే విభిన్న కోర్సులుగా చెప్పుకోవచ్చు. వీటితోపాటు
బీఏ, బీకాం, బీఎస్సీ, ఎంఏ, ఎంకాం, ఎమ్మెస్సీ కోర్సులు ఇక్కడ దూరవిద్యలో
అందుబాటులో ఉన్నాయి.