2020 పరీక్ష షెడ్యూల్ విడుదల



ప్రత్యక్ష ఉపయోగాలు
గేట్‌తో మనదేశంలోని అన్ని ఉన్నత విద్యాసంస్థల్లో పీజీ కోర్సులో ప్రవేశంతోపాటు నెలకు రూ. 12,400/- ఉపకార వేతనం లభిస్తుంది.* ఈ స్కోరు పీహెచ్‌డీ ప్రవేశాలకు కూడా ఉపయోగపడుతుంది. నెలకు రూ. 28,000/- ఉపకార వేతనం ఇస్తారు. * ఎన్‌ఐటీఐఈ (ముంబయి)లో పీజీడీఐఈ, పీజీడీపీఎం, పీజీడీఎంఎంలలో ప్రవేశానికి గేట్ స్కోరును పరిగణనలోకి తీసుకుంటారు. * ప్రభుత్వరంగ సంస్థలైన మహారత్న, నవరత్న, మినీరత్న కలిగిన సంస్థలతోపాటు కొన్ని ప్రైవేట్ సంస్థలు ఈ స్కోరు ఆధారంగా ఉద్యోగాలను భర్తీ చేస్తున్నాయి. * వివిధ ఐఐఎంలలో ఫెలో ప్రోగ్రాం ఇన్ మేనేజ్‌మెంట్ అడ్మిషన్లకు గేట్ ప్రాతిపదిక. |
పరోక్ష ప్రయోజనాలు
* గేట్ సన్నద్ధత ఇంజినీరింగ్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ స్టేజ్-1 టెక్నికల్ పేపర్ ప్రిపరేషన్‌కు గట్టి పునాది.* ఇతర పోటీ పరీక్షల సన్నద్ధత సులభమవుతుంది. * క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌కూ, ప్రైవేటు సంస్థలు నిర్వహించే ఇంటర్వ్యూలకూ ఈ తయారీ ఉపయోగపడుతుంది. |
పరీక్ష విధానం
ప్రశ్నపత్రంలో మొత్తం 100 మార్కులకు 65 ప్రశ్నలుంటాయి. పరీక్ష వ్యవధి మూడు గంటలు. ప్రశ్నపత్రంలో రెండు విభాగాలుంటాయి.
విభాగం-1: (జనరల్ ఆప్టిట్యూడ్):
ఇందులో పది ప్రశ్నలుంటాయి. ఒకటి నుంచి ఐదు ప్రశ్నలకు ఒక్కో ప్రశ్నకు ఒక
మార్కు, 6 నుంచి 10 ప్రశ్నలకు ఒక్కో ప్రశ్నకు రెండు మార్కులుంటాయి. ఈ
విభాగంలోని నాలుగు నుంచి ఐదు ప్రశ్నలు ఇంగ్లిష్ సంబంధితమైనవి (వెర్బల్
ఎబిలిటీ). మిగతా ప్రశ్నలు క్వాంటిటేటివ్‌కు సంబంధించిన ప్రశ్నలు ఇవ్వొచ్చు.విభాగం-2: (సంబంధిత ఇంజినీరింగ్ సబ్జెక్టు): ఈ విభాగంలో 55 ప్రశ్నలుంటాయి. 1-25 ప్రశ్నలకు ఒక్కో ప్రశ్నకు ఒక మార్కు. 26- 55 ప్రశ్నలకు ఒక్కోప్రశ్నకు రెండు మార్కులుంటాయి. * ఒక తప్పు జవాబుకు 33.33 శాతం మార్కులను తగ్గిస్తారు. అంటే ఒక మార్కు ప్రశ్నలకు 1/3, రెండు మార్కుల వాటికి 2/3 చొప్పున మైనస్ మార్కులుంటాయి. అయితే న్యూమరికల్ ప్రశ్నలకు రుణాత్మక మార్కులుండవు. |
టాప్ ర్యాంకుకు సూత్రాలు
![]() మెలకువలు: సొంత అధ్యయన ప్రణాళికను రూపొందించుకోవాలి. ఇది స్వీయ అభిరుచికి తగినట్లుగా ఉంటుంది కాబట్టి సాధనకు మంచి మార్గాన్ని సూచిస్తుంది. ఈ ప్రణాళికే గేట్‌లో మంచి ర్యాంకు/మార్కులు సాధించి పెట్టటానికి మొదటి మెట్టు. ఇతరుల ప్రణాళికను అనుకరించకపోవడమే మేలు. *సిలబస్‌ను క్షుణ్ణంగా పరిశీలిస్తే ఏ సబ్జ్జెక్టులో ఏ అంశాలపై ఎక్కువ దృష్టి పెట్టాలో అవగతమవుతుంది. దీనితో పాటు పరీక్ష విధానాన్ని అర్థం చేసుకోవడమూ ముఖ్యమే. దీనివల్ల పరీక్షలోని విభాగాలపై, ప్రశ్నల సాధనపై స్పష్టత వస్తుంది. * ఏ సబ్జెక్టునూ నిర్లక్ష్యం చేయకుండా అన్ని సబ్జెక్టుల్లో ప్రతి అధ్యాయాన్నీ చదవాలి. * ప్రిపరేషన్ త్వరగా మొదలుపెట్టి, అత్యంత త్వరితంగా పూర్తిచేయాలి. దీనివల్ల సిలబస్‌లో వున్న కాన్సెప్టులు, విషయాలను ఎక్కువగా సాధన చేసుకోవచ్చు. * చదివిన ప్రతి అంశాన్నీ వీలైనన్ని ఎక్కువసార్లు పునశ్చరణ చేయాలి. ఇదెంతో ముఖ్యం. * ప్రతి అధ్యాయానికీ సంబంధించి ముఖ్యాంశాలను చిన్నచిన్న పట్టికల ద్వారా సంక్షిప్తంగా తయారు చేసుకోవాలి. ఇవి పునశ్చరణకు ఎంతగానో ఉపయోగపడతాయి. * అధ్యయన సందర్భంగా ఎదురయ్యే సందేహాలను ఎప్పటికప్పుడు నివృత్తి చేసుకోవాలి. * పుస్తకాల్లోని సాల్వ్‌డ్, అన్-సాల్వ్‌డ్ ప్రశ్నలను అభ్యాసం చేయాలి. * గత ప్రశ్నపత్రాల సాధన తప్పనిసరి. దీనివల్ల ఏ అంశాలకు, ఏ కాన్సెప్టులకు ప్రాధాన్యం ఇచ్చారో అర్థమవుతుంది. వేటిపై ఎక్కువ దృష్టి పెట్టాలో తెలుస్తుంది. ఐఈఎస్ ప్రిలిమ్స్ ఆబ్జెక్టివ్ ప్రశ్నపత్రాలు, ఇతర రాష్ట్రాల పోటీపరీక్షల ప్రశ్నపత్రాలు కూడా సాధన చేయాలి. * వీలైనన్ని ఎక్కువ ఆన్‌లైన్ టెస్టులు రాయాలి. దానిలో చేసిన తప్పులను సవరించుకోవాలి. * వర్చువల్ కాల్‌క్యులేటర్ గురించి ప్రతిదీ తెలుసుకుని సాధన చేయాలి. * రోజూ 8 నుంచి 10 గంటల సమయం సాధనకు కేటాయించాలి. అయితే సన్నద్ధతలో పరిమాణం కంటే నాణ్యత ముఖ్యం. * క్లిష్టమైన, సాధారణ, అతిసాధారణ అంశాలకు సమాన ప్రాధాన్యం ఇవ్వాలి. * ప్రాథమికాంశాలపై అవగాహన తెచ్చుకొని తరువాత కఠినమైన ప్రశ్నలను సాధన చేయాలి. * ప్రతి వారాంతం, నెలకొకసారి చదివిన అంశాలను విశ్లేషించుకోవాలి. * పరీక్షలో అధిక సమయం పట్టే, క్లిష్టమైన ప్రశ్నలకు ఎక్కువ సమయం వృథా చేయకూడదు. సులువైన ప్రశ్నలను మొదటే పూర్తిచేయాలి. * ప్రతి ప్రశ్నకూ సమాధానం రాయడం కష్టం. మూడు గంటల వ్యవధిలో ఎన్ని ప్రశ్నలు, ఏ ప్రశ్నలు రాస్తే ఎక్కువ మార్కులు సాధించగలమనేది నిర్ణయించుకోవాలి. |
సమ్మేళనం.. నూతనత్వం
![]()
- వై.వి.గోపాలకృష్ణమూర్తి
|
ముఖ్యమైన తేదీలు
ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రారంభం: 03 సెప్టెంబర్ 2019.ఆన్‌లైన్ దరఖాస్తుల సమర్పణ గడువు: 24 సెప్టెంబర్ 2019 పరీక్ష తేదీలు: 1, 2, 8, 9 ఫిబ్రవరి, 2020. http://gate.iitd.ac.in |
రిఫరెన్స్ పుస్తకాలు
న్యూమరికల్ ఎబిలిటీ: ఆర్.ఎస్ అగర్వాల్మ్యాథమేటిక్స్: ఏఆర్ వసిష్ట, బీఎస్. గ్రేవాల్, హెచ్‌కే దాస్ |
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి