
అభివృద్ధిలో కీలకం.. సివిల్
దేశాభివృద్ధిలో
సివిల్ ఇంజినీరింగ్ విభాగానిది కీలక పాత్ర. రోడ్లు, బ్రిడ్జి, ఇరిగేషన్
డ్యామ్‌ల, కెనాల్‌ల నిర్మాణం, నగర డ్రెయినేజీ, నగర నిర్మాణ ప్రణాళికలు
తయారుచేసేందుకు సివిల్ ఇంజనీరింగ్ విభాగం ఉపయోగపడుతుంది. ఈ బ్రాంచిని
ఎంచుకోవాలంటే... గణితం, భౌతిక, రసాయనశాస్త్రంలో ప్రాథమిక పరిజ్ఞానం అవసరం.
చేరినవారు సివిల్ విభాగంలో ఉపయోగించే వివిధ సాఫ్ట్‌వేర్‌లపై అవగాహన
పెంచుకోవాల్సివుంటుంది. .ఉపాధి: దేశంలో నిర్మాణరంగం అభివృద్ధి సాధిస్తుండడంతో సివిల్ ఇంజనీరింగ్ కోర్సులు పూర్తిచేస్తే మంచి భవిష్యత్తు లభిస్తుంది. నైపుణ్యం ఉంటే ప్రభుత్వ, ప్రైవేటు రంగాలతో పాటు సొంతంగా పనిచేసుకునే అవకాశం ఉంది. ప్రభుత్వరంగంలో ఇరిగేషన్, రైల్వేలు, పవర్‌ప్రాజెక్టులు, పంచాయతీరాజ్, స్థానిక ప్రభుత్వాలతో పాటు అనేక జాతీయ సంస్థల్లో ఉద్యోగాలు ఉన్నాయి. ప్రైవేటు రంగంలో నిర్మాణం, ప్లానింగ్, డిజైనింగ్, క్వాలిటికంట్రోల్ లాంటి వాటిల్లో కొలువులు లభిస్తున్నాయి. సర్వేయర్ పేరుతో కువైట్, దుబాయి దేశాల్లో ఉద్యోగావకాశాలున్నాయి. ఉన్నతవిద్య: యూజీ తరువాత పీజీలో దాదాపు ఎనిమిది ప్రత్యేక కోర్సులున్నాయి. పీహెచ్‌డీ చేసినవారికి బోధన రంగంతో పాటు ప్రైవేటు సంస్థల్లోనూ ఉద్యోగాలు లభిస్తాయి. విదేశాల్లోనూ వీరికి మంచి భవిష్యత్తు ఉంది. |
వన్నె తరగని.. మెకానికల్
![]() ఉపాధి: కోర్ విభాగంలో పరిజ్ఞానం, కంప్యూటర్ అవగాహనతో పాటు కొన్ని సాఫ్ట్‌వేర్‌లను నేర్చుకుంటే ఉపాధికి ఢోకా ఉండదు. ప్రభుత్వరంగంలోని రైల్వేలు, ఇరిగేషన్, సింగరేణి, హెచ్‌ఏఎల్, బీహెచ్‌ఈఎల్, ఇస్రో లాంటి సంస్థల్లో ఉద్యోగాలు ఉన్నాయి. ఎత్తిపోతల పథకంలో పంపుల భారీ మోటార్‌ల నిర్వహణ విభాగంలోనూ అవకాశాలుంటాయి. ప్రైవేటు రంగంలోని ఆటోమొబైల్ విభాగంలో ఉద్యోగాలు లభిస్తాయి. ఉన్నతవిద్య: మెకానికల్ ఇంజినీరింగ్‌లో బీటెక్ పూర్తిచేసిన విద్యార్థులు దాదాపు 10 విభాగాల్లో పీజీ చేయవచ్చు. అనంతరం దేశ విదేశాల్లో పరిశోధనకు ఎంతో అవకాశం ఉంది. పీహెచ్‌డీ పూర్తి చేసినవారికి ఆటోమెబైల్ రంగంలోని ఆర్‌అండ్‌డీ విభాగంలో, బోధన రంగంలో మంచి అవకాశాలున్నాయి. |
ఐఓటీలో అవకాశాలను అందించే ఈఐఈ
ఇంజినీరింగ్‌లో
తప్పకుండా పరిశీలించాల్సిన మరో బ్రాంచి ఎలక్ట్రికల్ అండ్
ఇన్‌స్ట్రుమెంటేషన్ ఇంజినీరింగ్ (ఈఐఈ). ఇటీవలికాలంలో విరివిగా
వినిపిస్తున్న ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐఓటీ) సాంకేతికతకు
ఇన్‌స్ట్రుమెంటేషనే మూలాధారం. విస్తరిస్తున్న హెల్త్‌కేర్ రంగంలో దీని
పాత్ర ఉంది. ఈ బ్రాంచికి పోటీ తక్కువ. కానీ భవిష్యత్తులో అవకాశాలు
బాగుంటాయి. అన్ని రంగాల్లో ఐటీ తప్పనిసరిగా మారినట్టే ఇన్‌స్ట్రుమెంటేషన్
కూడా ప్రతి ఇంజినీరింగ్ విభాగం తయారీ ప్రక్రియల్లో అవసరమవుతోంది.
యంత్రపరికరాలు ఆధునికతను సంతరించుకునే క్రమంలో ఎలక్ట్రానిక్స్ వాడకం
పెరిగి ఈఐఈ.. ప్రత్యేక ఇంజినీరింగ్ విభాగంగా అవతరించింది. దీని వినియోగం
పరిశ్రమలకే పరిమితం కాదు. వాషింగ్ మెషిన్, ఏర్ కండిషనర్, గీజర్,
మైక్రోవేవ్ ఒవెన్‌లాంటి గృహోపకరణాల్లోనూ ఆటో కటాఫ్ వంటి ఫీచర్ల
అభివృద్ధికి ఇన్‌స్ట్రుమెంటేషన్ వినియోగిస్తారు. స్మార్ట్ నగరాలు,
వాహనాలను సిద్ధం చేయడంలోనూ దీని అవసరం ఎంతో ఉంది.ఉన్నత విద్య: తెలుగు రాష్ట్రాల్లో పదికి పైగా కళాశాలల్లో, ఇతర రాష్ట్రాల్లోనూ ఈ కోర్సు అందుబాటులో ఉంది. బీటెక్ తర్వాత ఉన్నతవిద్యను అభ్యసించాలనుకునే ఈఐఈ విద్యార్థులకు ఎన్నో అవకాశాలున్నాయి. ఐఐటీల్లోనూ, బెంగళూరులోని ఐఐఎస్‌సీలోనూ కలిపి 20కి పైగా రంగాల్లో ఎంటెక్ చేయవచ్చు. విదేశాలకు వెళ్లాలనుకుంటే జర్మనీ, స్వీడన్, యూఎస్‌ఏ, యూకే, ఆస్ట్రేలియా, ఇటలీ, ఇజ్రాయెల్ దేశాల్లో అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగావకాశాలు: ఇందులో ఇంజినీరింగ్ చేసినవారికి ఫార్మాస్యూటికల్, పెట్రోకెమికల్, వాహనతయారీ, రోబోటిక్స్, ఏరోస్పేస్, ఎలక్ట్రానిక్ డిజైన్, రక్షణ రంగాల్లో ఉపాధి లభిస్తుంది.
- డా. చక్రవర్తుల కిరణ్, అసోసియేట్ ప్రొఫెసర్,
వీఎన్‌ఆర్ విజ్ఞానజ్యోతి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ |
నవరత్న యోగం.. ఈఈఈ
ఎలక్ట్రికల్
అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ (ఈఈఈ)కు అన్ని బ్రాంచిలతో ఏదో ఒకరకంగా
సంబంధం ఉంటుంది. ఈ బ్రాంచిలో ఇంజినీరింగ్ పూర్తిచేస్తే ప్రభుత్వ,
ప్రైవేటు రంగాల్లో మంచి ఉద్యోగావకాశాలున్నాయి. ఇది కష్టంగా ఉంటుందనేది అపోహ
మాత్రమే. ఈ బ్రాంచి విద్యార్థులు భౌతిక, రసాయన, గణిత శాస్త్రాలతో పాటు
ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ బేసిక్స్‌లో నైపుణ్యం సాధించాల్సి ఉంటుంది.
కంప్యూటర్ పరిజ్ఞానం, ఎలక్ట్రికల్ రంగంలోని పలు సాఫ్ట్‌వేర్‌లపై అవగాహన
సాధించాలి.ఉపాధి: ఈ బ్రాంచిలో డిగ్రీ పూర్తిచేసినవారికి ప్రభుత్వరంగంలో ట్రాన్స్‌కో, జెన్‌కో, సింగ·రేణిలతో పాటు నవరత్న కంపెనీలు, జాతీయ పవర్‌కంపెనీల్లో ఉపాధి లభిస్తుంది. ప్రైవేటు రంగంలోనూ, సాఫ్ట్‌వేర్ వైపూ ఉద్యోగాలు లభిస్తాయి. ఉన్నతవిద్య: 10 విభాగాల్లో పీజీ చేసే అవకాశం ఉంది. అనంతరం పరిశోధన చేస్తే బోధనరంగంతో పాటు వివిధ సంస్థల్లో పరిశోధకులుగా ఉద్యోగాలుంటాయి. ముఖ్యంగా సంప్రదాయేతర శక్తి వనరుల రంగంలో పరిశోధనలు చేసే వారికి మంచి భవిష్యత్తు ఉంది. ప్రస్తుతం సౌరవిద్యుత్ రంగంలో పరిశోధనకు మంచి అవకాశాలున్నాయి. పరిశోధన కోసం జాతీయ, అంతర్జాతీయ సంస్థల ఫెలోషిప్స్ అందుబాటులో ఉన్నాయి. |
వైద్యంతో అనుసంధానం.. బయోమెడికల్
మెడికల్
కోర్సుతో సంబంధాలుండే ఇంజినీరింగ్ బ్రాంచి బయోమెడికల్. అన్ని
ఇంజినీరింగ్ విభాగాల సూత్రాలు, మెడిసిన్‌లోని కొన్ని సబ్జెక్టుల మిశ్రమంతో
ఈ విభాగం ఉంటుంది. ఆసుపత్రుల్లో ఉపయోగించే వైద్యపరికరాల తయారీ, వాటి సమర్థ
నిర్వహణను వీరు చూడాల్సి ఉంటుంది. పరికరాల పనితీరును వివరించే క్రమంలో
మంచి కమ్యూనికేషన్ నైపుణ్యాలు అవసరమవుతాయి.ఉపాధి: ప్రైౖవేటు రంగంలోని వైద్యపరికరాల తయారీ సంస్థల్లో, ఆసుపత్రుల్లో ఉద్యోగాలు లభిస్తున్నాయి. కోర్సుతో పాటు కొన్ని సాఫ్ట్‌వేర్ లాంగ్వేజ్‌లు నేర్చుకుంటే ఉద్యోగ అవకాశాలు మరింత మెరుగవుతాయి. ఉన్నతవిద్య: అమెరికా, జర్మన్, సింగపూర్ లాంటి దేశాల్లో పీజీ, పీహెచ్‌డీ కోర్సులు చేయటానికి అవకాశాలున్నాయి.ఇవి పూర్తి చేసినవారికి మంచి భవిష్యత్తు ఉంటుంది.
- వెంకన్న భూక్యా, న్యూస్‌టుడే, ఉస్మానియా యూనివర్సిటీ, హైదరాబాద
|
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి