కెరియర్ గైడెన్స్ - స్పోర్ట్స్ కోచింగ్

గెలుపోటములకు కారణాలను విశ్లేషిస్తుంటారు. వాళ్లే శిక్షకులు (కోచ్‌లు). ఆటగాళ్లకు సానపెడుతూ.. సమర్థంగా ఆడేందుకు సాయడేది వీళ్లే. క్రీడాకారులను విజయం వైపు నడిపించే బాధ్యతాయుతమైన కోచ్‌లుగా కెరియర్ కొనసాగించాలంటే కొన్ని కోర్సులు చేయాలి. వాటిని పూర్తి చేస్తే ఎన్నో అవకాశాలను అందుకోవచ్చు.

ఆటగాళ్లు తమ శక్తిని ఎలా ఉపయోగించాలి? ఎలాంటి వ్యూహాలు ఉపయోగించాలన్న అంశాలపై దృష్టిపెట్టేది కోచ్‌లే! తమ క్రీడాకారులను సరిగా సన్నద్ధం చేయడంలో వీరు ప్రధాన పాత్ర పోషిస్తారు. వారిలో దాగివున్న ప్రతిభకు సానపెడతారు. మనదేశంలో ఆటగాళ్లకు ఆదరణ ఎక్కువ. వారిని దేవుళ్లుగా చూసేవాళ్లూ లేకపోలేదు. అందుకే వీళ్లు తమ క్రీడా సామర్థ్యాన్ని కొనసాగించడానికీ, ఆటల్లో మంచి ప్రదర్శనకూ ట్యూటర్లు, కోచ్‌లపై ఆధార పడుతుంటారు.

కావాల్సిన లక్షణాలివీ!
![]() |
అందిస్తున్న ప్రముఖ సంస్థలు
నేతాజీ సుభాష్ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ స్పోర్ట్స్, పాటియాలా, బెంగళూరు, కోల్‌కతా, తిరువనంతపురం * లక్ష్మీబాయి నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్, గ్వాలియర్, గువాహటి * నేషనల్ స్పోర్ట్స్ యూనివర్సిటీ, ఇంఫాల్, మణిపూర్ * తమిళనాడు ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ యూనివర్సిటీ, చెన్నై * స్వర్ణిమ్ గుజరాత్ స్పోర్ట్స్ యూనివర్సిటీ, గుజరాత్ * లక్ష్మీబాయి నేషనల్ కాలేజ్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్, తిరువనంతపురం * ఎస్‌జీటీ యూనివర్సిటీ, గుఢ్‌గావ్, హరియాణ * బెంగళూరు యూనివర్సిటీ, కర్ణాటక * ఇందిరాగాంధీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ సైన్స్, న్యూదిల్లీ * పంజాబ్ యూనివర్సిటీ, చండీగఢ్ |
కెరియర్ అవకాశాలు
![]() కెరియర్ ప్రారంభంలో అనుభవమున్న శిక్షకుడి దగ్గర వాలంటీర్ కోచ్, సహాయకుడిగా చేరి, అనుభవాన్ని సాధించొచ్చు. ఆపై కోచ్ స్థాయికి ఎదగొచ్చు. మంచి నైపుణ్యాలు ఉన్నవారికి విదేశాల్లోనూ మంచి జీతంతో కూడిన అవకాశాలున్నాయి. ఎంపికైన సంస్థ, అది ఉన్న ప్రదేశాన్ని బట్టి వేతనాల్లో మార్పులుంటాయి. సాధారణంగా విద్యాపరమైన అర్హతలున్నవారికి ప్రారంభ వేతనం నెలకు రూ.20,000 నుంచి రూ.25,000 పైగా ఉంటుంది. అనుభవం సాధించేకొద్దీ వేతనాల్లో పెరుగుదల ఉంటుంది. |
ప్రస్తుతం కొన్నింటిలోకి ప్రవేశాలు
సాధారణంగా ప్రవేశాలకు సంబంధించిన నోటిఫికేషన్లు మే నుంచే ప్రారంభమవుతాయి. ప్రస్తుతం కొన్ని సంస్థలు ప్రవేశాలను నిర్వహిస్తున్నాయి.* భారత యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖకు చెందిన లక్ష్మీభాయి నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ అందించే స్పోర్ట్స్ కోచింగ్ కోర్సులకు దరఖాస్తు చేసుకోవడానికి చివరితేదీ కొన్నింటికి ముగిసింది. మరికొన్నింటికి జులై 7, 12 వరకు ఉన్నాయి. ఉమ్మడి ప్రవేశపరీక్ష ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు. * గుజరాత్‌కు చెందిన స్వర్ణిమ్ గుజరాత్ స్పోర్ట్స్ యూనివర్సిటీలోనూ ప్రవేశాలు మొదలయ్యాయి. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. జులై 4లోగా నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ప్రవేశపరీక్ష జులై 7న నిర్వహించనున్నారు. * పంజాబ్ యూనివర్సిటీ అందించే కోర్సులకు జులై 3లోగా దరఖాస్తు చేసుకోవాలి. |
(వివిధ యూనివర్సిటీలు అందిస్తున్న రకరకాల కోర్సుల వివరాలకు www.eenadupratibha.net చూడవచ్చు.) |
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి