కెరియర్ గైడెన్స్ - సైకాలజీ


పోస్ట్‌గ్రాడ్యుయేషన్ కోర్సుల్లో సైకాలజీని ప్రధాన అంశంగా చదివినవారిని మనస్తత్వశాస్త్ర నిపుణులు అంటారు. ఈ శాస్త్రాన్ని వృత్తిగా చేసుకోవాలంటే క్లినికల్ లేదా కౌన్సెలింగ్ సైకాలజీలో ఎం.ఫిల్ లేదా పీహెడ్‌డీ చేసి ఉండాలి. పునరావాసం లేదా క్లినికల్ సైకాలజీలో ఎం.ఫిల్. లేదా పీహెచ్‌డీ చేసిన వారిని భారత పునరావాస మండలి అధికారికంగా గుర్తించి వారు సొంతంగా వృత్తి నిర్వహించుకోడానికి అనుమతిస్తుంది. మనస్తత్వశాస్త్ర నిపుణులకు మందులను సూచించే అర్హత లేదు. వైద్యశాస్త్రంలో పట్టా పొందిన తర్వాత డీపీఎం లేదా ఎండీ (సైకియాట్రీ) చేసినవారిని మనోవిజ్ఞానశాస్త్ర నిపుణులు అంటారు. వీరు మానసిక రుగ్మతలకు మందుల ద్వారా చికిత్స అందిస్తారు.
విభిన్న కోర్సులు
చైల్డ్
సైకాలజీ, క్లినికల్, కౌన్సెలింగ్, ఎడ్యుకేషనల్, పారిశ్రామిక
మనోవిజ్ఞానశాస్త్రం, ఆరోగ్య మనస్తత్వశాస్త్రం... ఇలా అనేక విభాగాలు
ఉన్నాయి. వాటిలో పోస్ట్‌గ్రాడ్యుయేషన్ కోర్సులు అందుబాటులోకి వచ్చాయి. ఎంఏ
లేదా ఎంఎస్సీ స్థాయిలో వాటిని ఐచ్ఛికంగా ఎంచుకున్నవారికి ఆయా రంగాల్లో
ఉద్యోగావకాశాలు లభిస్తున్నాయి.డిగ్రీ: బీఏ లేదా బీఎస్సీ సైకాలజీని డిగ్రీస్థాయిలో చదువుకోవచ్చు. దీనికి ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులై ఉండాలి. కోర్సు కాలవ్యవధి మూడు సంవత్సరాలు. రెగ్యులర్‌తో పాటు దూరవిద్యావిధానంలోనూ ఈ కోర్సు అందుబాటులో ఉంది. ప్రస్తుతం అన్ని విశ్వవిద్యాలయాలూ సీబీసీఎస్ (ఛాయిస్ బేస్డ్ క్రెడిట్ సిస్టం) విధానంలో ఆరు సెమిస్టర్లుగా డిగ్రీ కోర్సును అందిస్తున్నాయి. వీటిల్లోకి నేరుగా ప్రవేశం పొందవచ్చు.

పీజీ డిప్లొమా: ఒక సంవత్సరం కాలవ్యవధి ఉండే రెగ్యులర్ కోర్సులోకి పరీక్ష ద్వారా ఎన్‌సీఈఆర్‌టీ ప్రవేశం కల్పిస్తోంది. ఎంఏ లేదా ఎంఎస్సీలో కనీసం 55 శాతం మార్కులు పొందినవారు ఈ పరీక్ష రాయటానికి అర్హులు. దూరవిద్యావిధానం ద్వారా అనేక యూనివర్శిటీలు నేరుగా ప్రవేశాలను ఇస్తున్నాయి. స్కూల్ కౌన్సెలర్లుగా చేరాలంటే ఈ కోర్సు తప్పనిసరిగా చేయాలి.
పరిశోధన స్థాయిలో: రెండేళ్ల కాల వ్యవధి ఉండే ఎం.ఫిల్‌లో క్లినికల్ సైకాలజీ చదవాలంటే భారత పునరావాస మండలి (ఆర్‌సీఐ) నిబంధనల ప్రకారం ఎంఏ లేదా ఎంఎస్సీ సైకాలజీ కోర్సు కనీసం 55 శాతం మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి. యూనివర్శిటీలు నిర్వహించే ప్రవేశపరీక్షలో మెరిట్ సాధించాలి. కోర్సు పూర్తిచేసిన తర్వాత ఆర్‌సీఐలో అధికారికంగా పేరు రిజిస్ట్రేషన్ చేసుకుని సొంతంగా ప్రాక్టీస్ చేసుకోవచ్చు.
సైకాలజీ లేదా క్లినికల్ సైకాలజీలో పీహెచ్‌డీ చేయడానికి పీజీలో కనీసం 55 శాతం మార్కులతో పాటు యూనివర్శిటీలు నిర్వహించే ప్రవేశపరీక్షల్లో ఉత్తీర్ణత పొందటం తప్పనిసరి. యూజీసీ నిర్వహించే నెట్‌్, జేఆర్‌ఎఫ్‌ల్లో అర్హత సాధిస్తే పీ‡హెచ్‌డీ…లోకి నేరుగా ప్రవేశం పొందవచ్చు. పీహెచ్‌డీ క్లినికల్ సైకాలజీలోకి మాత్రం యూనివర్సిటీలు ప్రవేశపరీక్ష ద్వారానే అడ్మిషన్లు ఇస్తున్నాయి.
ఉపాధి అవకాశాలు

పాఠశాలలు, కళాశాలల్లో కౌన్సెలర్లు, మానసిక వికలాంగుల పాఠశాలలు, వికలాంగుల పునరావాసకేంద్రాలు, చైల్డ్ గైడెన్స్ క్లినిక్‌లు, రక్షణ పరిశోధన సంస్థలు, వ్యక్తిత్వ వికాసకేంద్రాలు, వివాహ మంత్రణ కేంద్రాలు, స్వచ్ఛంద సేవాసంస్థలు, మానసిక ఆరోగ్య కేంద్రాలు, హెచ్‌ఐవీ ఎయిడ్స్ కౌన్సెలింగ్ కేంద్రాలు, మార్కెటింగ్ విభాగాలు, ఫ్యామిలీ కౌన్సెలింగ్ కేంద్రాలు, ఒకేషనల్ గైడెన్స్ కేంద్రాల్లో సైకాలజీ అధ్యయనం చేసినవారికి ఉద్యోగావకాశాలున్నాయి.
విద్య, పారిశ్రామిక రంగాల్లో సైకాలజిస్టులకు నెలకు రూ.25 వేల నుంచి రూ.70 వేల వరకు జీతం చెల్లిస్తున్నారు. సొంతంగా ప్రాక్టీస్ చేసుకుంటే ఇంతకన్నా ఎక్కువ సంపాదించే వీలుంది. విదేశాల్లోనూ వీరికి మంచి డిమాండ్ ఉంది.
అందిస్తున్న సంస్థలు

* కృష్ణ విశ్వవిద్యాలయం, విజయవాడలోని ఎస్.ఆర్.ఆర్. కళాశాల నుంచి రెగ్యులర్ విధానంలో ఎంఎస్సీ సైకాలజీ కోర్సు అందిస్తోంది.* హైదరాబాదు కేంద్రీయ విశ్వవిద్యాలయం రెగ్యులర్ విధానంలో ఎంఎస్‌సీ హెల్త్ సైకాలజీ కోర్సు అందిస్తోంది. * యోగి వేమన యూనివర్శిటీ రెగ్యులర్ విధానంలో ఎంఎస్సీ సైకాలజీ కోర్సు అందిస్తోంది. *ఉస్మానియా యూనివర్శిటీ ఆర్‌సీఐ అనుమతితో ఎం.ఫిల్ క్లినికల్ సైకాలజీ కోర్సు నిర్వహిస్తోంది
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి